💐ఊహించని ఉపద్రవం 💐
^^^^^^^^^^^^^^^^^^^^^^^^
బతుకు భారంగా
మనసు వికారంగా
ప్రతి క్షణం భయం భయం గా.....
ఈరోజు నేను మా శ్రీమతి హరిచంద్ర స్మశాన వాటిక మీదుగా వచ్చాం .గేటు బయట ఒక పదిమంది దైన్యం నింపుకున్న కళ్ళతో .దుఃఖం మింగు కుంటూ .నిర్జీవంగా కనిపించారు .లోపల చూస్తే మూడు కాస్టలు కనకన మండుతున్నాయి . మరో రెండు శవాలు ముటించడానికి సంసిద్ధం మౌవుతున్నాయి .ఇక్కడ రాత్రింబవళ్ళు కాష్టాలు కాలుతూనే ఉన్నాయి అన్నాడు అక్కడున్న ఒక వ్యక్తి .
మా అన్న గారికి కరోణ పాజిటివ్ వచ్చింది .పట్నంలోని వైద్యశాల అన్నిటిలో అడ్మిషన్ కోసం విచారించాము. ప్రతి వైద్యశాల రోగగ్రస్తులతో కిటకిటలాడుతున్నది. బెడ్సు లేవు బెడ్సు ఉన్న ఆక్సిజన్ అందుబాటులో లేదు .వెంటిలేటర్లు అసలు లేవు. సిఫార్సు లేనిదే ఎక్కడ అడ్మిషన్ దొరికే పరిస్థితి లేదు. వీధుల్లో ప్రతి గంట కు సైరన్ మోగించుకుంటూ అంబులెన్సులు పరిగెడుతున్నాయి .ఈ పరిస్థితి తిరుపతిలో మాత్రమే కాదు. దేశమంతా ఇదే పరిస్థితి...
కాలుతున్నకాష్టాలు.
అనాధలైన కుటుంబ సభ్యులు.
వైద్యం అందక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆభాగ్యులు.
మందులు ,ఆక్సిజన్ ,వెంటిలేటర్లు, సరిపోని వైద్యశాలలు .
పని లేక తిండి దొరకక అల్లాడుతున్న కష్టజీవులు .
సందులో సడేమియా దోచుకుంటున్న గజదొంగలు *(నల్ల వ్యాపారం)
ఏమిటి మార్గం? ఎందుకుఈ దైన్యం? ఎప్పుడు పరిష్కారం?